31-03-2025 12:00:00 AM
పంచాంగ శ్రవణంలో వేద పండితులు ఆంజనేయ శర్మ వెల్లడి
పాల్గొన్న కలెక్టర్ ఆశిష్ సంగ్ వాన్, ఉద్యోగులు
కామారెడ్డి, మార్చి 30 (విజయ క్రాంతి): తెలుగువారి నూతన సంవత్సరం, విశ్వావసు నామ ఉగాది సంవత్సరమును పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా టీఎన్జీవోస్, టీజీవో సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో వేద పండితులు ఆంజనేయ శర్మ ,శిష్య బృందం చే విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది వేడుకలు, శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
వేద పండితులు బ్రహ్మశ్రీ ఆంజనేయ శర్మ పంచాంగ శ్రవణం సందర్భంగా మాట్లాడుతూ విశ్వావసు నామ సంవత్సరం లో రాష్టం, కామారెడ్డి జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని చిన్న పాటి ఒడిదొడుకులు ఉన్న పాలనాపరమైన ముందు చూపుతో సమస్యలు తొలగుతాయి అని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అందరికీ శుభాలను తీసుకురావాలని తెలుపుతూ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు,మహిళా పండితుల పంచ౦గా శ్రవణం ప్రశంసిస్తూ, ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన టిఎన్జీవోస్, టీజీఓ సంఘాలను కలెక్టర్ అభినందించారు.
పండితులు ఆంజనేయ శర్మ మాట్లాడుతూ కలక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు జరుపుకోవటం ఆనందంగా ఉందని, మహిళా పండితులతో పంచ౦గా శ్రవణం మొట్టమొదటి సారిగా కామారెడ్డి లో జరిగిందని తెలిపారు. పంచాంగ శ్రవణం అనంతరం ఉగాది పచ్చడి వితరణ చేశారు.
జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ నరాల వెంకట్ రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దేవేందర్, సాయి రెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ఎం నాగరాజు, సహధ్యక్షులు ఎం చక్రధర్, కోశాధికారి ఎం దేవరాజు, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, జాయింట్ సెక్రెటరీ గణేష్, కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.