26-04-2025 08:52:25 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారిగా ఇటీవల నియమితులైన డాక్టర్ భూక్యా రవి రాథోడ్ ను జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ... అధికారులు సంఘటితంగా పనిచేసి ప్రజలకు సేవలు అందిస్తూ, జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేసే విధంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కొప్పు ప్రసాద్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సారంగం, సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు.