15-03-2025 12:41:13 AM
కరీంనగర్, మార్చి 14 (విజయ క్రాంతి): కరీంనగర్ నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 19 న నిర్వహించనున్న జిల్లాస్థాయి యువ ఉత్సవ్ పోస్టర్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ జిల్లాస్థాయి యువ ఉత్సవ్ లో కవిత్వం, చిత్రలేఖనం, డిక్లమేషన్, మొబైల్ ఫోటోగ్రఫీ, సైన్స్ మేళా ఇండివిజువల్, గ్రూప్స్, కల్చరల్ డాన్స్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.