ఆదిలాబాద్,(విజయక్రాంతి): జిల్లాస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని జిల్లా పేరును అగ్ర భాగాన నిలపాలని జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి(District Olympic Association President Baluri Govardhan Reddy) ఆకాంక్షించారు. ఆదిలాబాద్ లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం(Indira Priyadarshini Stadium)లో ఉమ్మడి జిల్లా తైక్వాండో సీఎం కప్(Taekwondo CM Cup) ఎంపిక పోటీలు ఆదివారం ప్రారంభమైయ్యాయి. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి పలువురు క్రీడాకారులు హాజరయ్యారు.
జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులను గచ్చిబౌలి స్టేడియం(Gachibowli Stadium)లో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారులు వెంకటేశ్వర్లు, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, తైక్వాండో జిల్లా ఇన్చార్జ్ అన్నారపు వీరేష్, రాష్ట్ర టెక్నికల్ కమిటీ చైర్మన్ వెంకటస్వామి, సీనియర్ పి.డి హరిచరణ్, జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు శివప్రసాద్, జిల్లా ఆఫీస్ సెక్రెటరీ అకోజీవార్ శృతివీరేశ్, కోచ్ లు శివ, కన్య మాధవి, అజయ్ కుమార్ పాల్గొన్నారు.