calender_icon.png 20 September, 2024 | 2:47 AM

క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

19-09-2024 06:57:08 PM

జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్ 

జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఉద్యోగ జీవితంలో బిజీగా ఉన్న ఉద్యోగులకు క్రీడలు శారీరక మానసికోల్లాసం కలిగిస్తాయని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల క్రీడా పాఠశాల మైదానంలో అటవీ శాఖ ఉద్యోగులకు నిర్వహించిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ కు కాగజ్ నగర్ ఎఫ్డిఓ సుశాంత్ సుఖదేవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా జెండా ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం మాట్లాడుతూ క్రీడలు ఉద్యోగులకు కొంత ఊరటను కలిగిస్తాయన్నారు.

ఉద్యోగ జీవితం నుండి కొంత ఉపశమనం కలగడంతో పాటు మానసిక శారీరక ఆరోగ్యాన్ని కలిగిస్తాయని తెలిపారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అటవీ శాఖ క్రీడాకారులు జోనల్ స్థాయిలో పాల్గొంటారని వివరించారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 200 మంది వివిధ స్థాయిల అటవీ ఉద్యోగులు పాల్గొన్న జిల్లా స్పోర్ట్స్ మీట్ లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, క్యారమ్స్, చెస్ తో పాటు అథ్లెటిక్స్ నిర్వహించారు. క్రీడలను జిల్లా గిరిజన క్రీడల అధికారి మీనారెడ్డి పర్యవేక్షించగా, పీడీలు మధుసూదన్, తిరుపతి, రాకేష్ లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 11 రేంజ్ కార్యాలయాల ఎఫ్ఆర్ఓలతోపాటు, సిబ్బంది పాల్గొన్నారు.