calender_icon.png 18 October, 2024 | 12:09 AM

ఘనంగా ముగిసిన జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలు

17-10-2024 09:17:37 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్ లో  ఈ నెల 16, 17 తేదీలలో నిర్వహించిన జిల్లాస్థాయి కళా ఉత్సవ్ పోటీలు గురువారం రాత్రి ఘనంగా ముగిసాయి. ఆరు కళా విభాగాలలో 175 మంది విద్యార్థులు, 75 మంది గైడ్ టీచర్లు, 18 మంది జడ్జీలు పాల్గొన్నారు. సమన్వయకర్త సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ కార్యాలయ ఎస్ఓలు కే చౌదరి, పి.శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి ఎస్ మధు బాబు , జడ్జిలు హాజరై విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు.

విజేతలు వీరే... 

గాత్రం విభాగంలో మొదటి స్థానం సరిత( కేజీబీవీ మంచిర్యాల), ద్వితీయ స్థానం ఉషారాణి (సాంఘిక సంక్షేమ పాఠశాల లక్షేట్టిపేట), తృతీయ స్థానం రాజేశ్వరి (కేజీబీవీ బెల్లంపల్లి ) లు సాధించారు.

వాయిద్య సంగీతం విభాగంలో ప్రథమ స్థానం ఆర్ వరుణ్ అండ్ టీం (జెడ్ పి హెచ్ ఎస్ సబ్బేపల్లి), ద్వితీయ స్థానం జెనిసి ( సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లక్షెట్టిపేట), తృతీయ స్థానం భూమిక్ అండ్ టీం (తెలంగాణ మోడల్ స్కూల్ మంచిర్యాల) లు

నృత్యం విభాగంలో మొదటి స్థానం జి సహస్ర గౌడ్ (స్లేట్ ఉన్నత పాఠశాల జన్నారం), ద్వితీయ స్థానం త్రిలోక్య గ్రూప్ (జెడ్ పి హెచ్ ఎస్ సబ్బేపల్లి), తృతీయ స్థానం శ్రీహిత (కేజీబీవీ తాండూర్) లు.

డ్రామా విభాగంలో ప్రథమ స్థానం రమ్య - శివరాం టీం (జడ్పీహెచ్ఎస్ ముత్యం పల్లి), ద్వితీయ స్థానం నేహా శ్రీ- లోహిత్ టీం (జెడ్ పి హెచ్ ఎస్ సబ్బేపల్లి), తృతీయ స్థానం జెడ్ పి హెచ్ ఎస్ వెల్గనూర్ సాధించాయి.

సాంప్రదాయ కథల పోటీ విభాగంలో ప్రథమ స్థానం నరేందర్ - బిందుప్రియ (జెడ్ పి హెచ్ ఎస్ ముత్యంపల్లి), ద్వితీయ స్థానం ఎస్ అరవిందరాణి( జెడ్ పి హెచ్ ఎస్ కిష్టాపూర్), తృతీయ స్థానం  ప్రజ్ఞ (జెడ్ పి హెచ్ ఎస్ సబ్బేపల్లి) లు,

విజువల్ ఆర్ట్స్ విభాగంలో ప్రథమ స్థానం ఎం వాస్తవ్ (ఆల్పోర్స్ జూనియర్ కాలేజ్ మంచిర్యాల), ద్వితీయ స్థానం బి మణికుమార్ (జడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల మంచిర్యాల), తృతీయ స్థానం డి హారిక (కేజీబీవీ జన్నారం) సాధించారు.