26-02-2025 12:11:29 AM
ఖమ్మం, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) :- ఖమ్మం ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ అటానమస్ కళాశాల లో భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని పలు విభాగాలలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది.క్విజ్, వన్ మినిట్ షో, ఇన్నోవేటివ్ ఐడియాస్, వకృత్వ, పోస్టర్ ప్రదర్శన అంశాలలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు.
ఈ పోటీలలో జిల్లా నుండి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాల లు, జూనియర్ కళాశాల నుండి విద్యార్థులు పాల్గొనడం జరిగినది. ప్రతి విభాగం నందు పోటీలో పాల్గొన్న విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ తో పాటు మొదటి రెండవ విజేతలకు బహుమతులు ఇవ్వనున్నామని భౌతిక శాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ డాక్టర్ పి అనిత తెలిపారు. ఐదు విభాగాల పోటీలకు న్యాయ నిర్నేతలుగా కళాశాల వివిధ విభాగాల ఆచార్యులు పాల్గొనడం జరిగినది.
సుమారుగా వివిధ డిగ్రీ కళాశాలలు మరి జూనియర్ కళాశాల నుండి 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలలో పాల్గొన్న విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎండి జకీరుల అభినందించారు. ఈ కార్యక్రమమునకు కన్వీనర్ గా శ్రీ సూరంపల్లి రాంబాబు వ్యవహరించారు. కార్యక్రమంలో భౌతిక శాస్త్ర విభాగ ఆచార్యులు శ్రీ బి శ్రీనివాస్ శ్రీ కె కిరణ్ కుమార్ శ్రీ బి రాజశేఖర్, శ్రీ ధర్మయ్య శ్రీమతి మీ అనురాధ పాల్గొన్నారు.
ఈ క్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ భానోత్ రెడ్డి, వివిధ విభాగాల నుండి అధ్యాపకులు శ్రీ కె. కార్తిక్, డాక్టర్ పి. రవికుమార్, శ్రీ పి.శ్రీనివాస్, డాక్టర్ పి రామచంద్ర రావు, బిందుశ్రీ, ఇంద్రాణి, డాక్టర్ పి. విజయకుమార్, శ్రీ ప్రభాకర్, జే.అనిత కుమారి, గౌసియా షేక్, శ్రీ కె. మధు, డాక్టర్ పి పూర్ణచంద్రరావు డాక్టర్ ఎన్ అనిత తదితరులు పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులకు ఫిబ్రవరి 28న కళాశాల లో జరిగే జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలో సర్టిఫికెట్లు బహుమతులు ప్రధానం జరుగుతుందని తెలియజేశారు.