16-12-2024 11:26:12 PM
ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్...
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఎన్‌టీఆర్ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించే సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించారు. మండల స్థాయిలో విజేతలు అయిన క్రీడా జట్టులకు జిల్లా స్థాయిలో ఆ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం అన్నారు. ఈ పోటీలో పాల్గొనే జట్లు గెలుపు కోసం కృషి చేయాలని ఓడిన జట్టు నిరాశ చెందకుండా గెలుపుకోసం పోరాడాలని సూచించారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి పోవాలని అక్కడ కూడా భాగ ఆటలు ఆడి నిర్మల్‌కు కప్‌లు తేవాలని ఆకాంక్షించారు.
క్రీడాకారులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. జిల్లాలోని 19 మండలాలతో పాటు నిర్మల్, ముదోల్, ఖానాపూర్, మున్సిపాలిటీలో గల క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొదట క్రీడా జెండాను ఆవిష్కరణ చేశారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలు ఆడారు. జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖమార్ అహ్మద్ తదితరులు ఉన్నారు.