ఆదిలాబాద్, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో అండర్-11 బాల బాలికల జిల్లాస్థాయి చెస్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను అసోసియేషన్ కన్వీనర్, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్, పోటీల ఆర్గనైజర్ ఎన్.స్వామి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మనిషి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు చెస్ క్రీడ దోహదం చేస్తుందన్నారు. మైండ్ గేమ్ చెస్ ను ప్రతి ఒక్కరు చిన్నప్పటినుండే సాధన చేయాలన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తి చాటి చక్కటి ప్రతిభతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు విట్టల్ రెడ్డి, నాందేవ్, జయశ్రీ, రాము, వినోద్, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.