calender_icon.png 23 December, 2024 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టహాసంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

12-09-2024 03:50:08 PM

పోటీలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ....

ఆదిలాబాద్, (విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లాస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను అట్టహాసంగా నిర్వహించారు. ఎంపిక పోటీలను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అథ్లెటిక్స్ వల్ల దేహదారుఢ్యంతో పాటు క్రమశిక్షణ పెంపొందుతుందన్నారు.  క్రీడాకారులందరూ నిజమైన క్రీడా స్ఫూర్తిని చాటి పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరచాలని ఆకాంక్షించారు. స్నేహపూర్వకమైన వాతావరణంలో పోటీలు జరగాలన్నారు.  జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేష్, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, పెటా సంఘం ప్రధాన కార్యదర్శి స్వామి,  పీ.డీ లు,  పి.ఈ.టి లు, కోచ్ లు, జిల్లాలోని వివిధ పాఠశాల నుండి సుమారుగా 600 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు.