calender_icon.png 23 March, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ అధినేత కేసిఆర్‌ను కలిసిన జిల్లా నేతలు

22-03-2025 12:34:57 AM

యాదాద్రి భువనగిరి మార్చి 21 ( విజయ క్రాంతి ): బి.ఆర్.ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సన్నాహక సమావేశాలు, కార్యక్రమాలు  జరుగుతున్న నేపథ్యంలో బి.ఆర్.ఎస్ అధినేత, కెసిఆర్ ను మాజీ మంత్రి ,  ఎమ్మెల్యే గుంటకండ్ల  జగదీశ్వర్ రెడ్డి, ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి (భువనగిరి ), గ్యాదరి కిషోర్ కుమార్ (తుంగతుర్తి ), గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి (ఆలేరు ) శుక్రవారం ఎర్రవెల్లి లోని వారి నివాసంలో కలిశారు . ఈ సందర్భంగా పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ , వరంగల్ బహిరంగ సభ తదితర అంశాలపై పార్టీ అధినేత నాలుగు నియోజక వర్గాల నాయకులకు దిశా నిర్దేశం చేశారు. త్వరలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిగతా ఎనిమిది నియోజకవర్గాల ముఖ్యనాయకులతో సమావేశం ఉంటుందని పార్టీ అధినేత వెల్లడించినట్లు తెలిపారు.