31-03-2025 12:00:00 AM
మహబూబ్ నగర్ మార్చి 30 (విజయ క్రాంతి): నూతన తెలుగు సంవత్సరం ఉగాది పర్వదిన వేడుకలను ఆదివారం జిల్లా ప్రిన్సిపాల్ జడ్జి బి పాపిరెడ్డి జిల్లా కేంద్రంలోని శిశు గృహలో అనాధ పిల్లల సమక్షంలో జ రుపుకున్నారు. ఈ సందర్భంగా అనాధ పిల్లలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్పా రు.
ఉగాది పండుగను పురస్కరించుకొని శిశు గృహ లోని అనాధ పిల్లలకు నూతన దుస్తులను కొనుగోలు చేసి ఇ వ్వాలని సూచిస్తూ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివి ల్ జడ్జి డి ఇందిర, సీనియర్ న్యాయవాది రవి కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.