calender_icon.png 23 March, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్ జైల్ ను సందర్శించిన జిల్లా జడ్జి

22-03-2025 08:38:56 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని సబ్ జైల్ ను జిల్లా జడ్జి శ్రీనివాసులు శనివారం సందర్శించి సబ్ జైల్లో సిబ్బందికి, అండర్ ట్రైన్ ఖైదీలకు స్పోర్ట్స్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీనివాసులు మాట్లాడుతూ.... ఖైదీలందరూ సత్ప్రవర్తనతో మెలిగి, ఉత్తమ పౌరులుగా మార్పు చెంది, మంచి జీవితాన్ని అనుభవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి అసాదుల్లా షరీఫ్, సబ్ జైల్ సూపర్డెంట్ తేజావత్ స్వామి, జైలు సిబ్బంది, ఖైదీలు తదితరులు పాల్గొన్నారు.