10-03-2025 08:32:29 PM
కామారెడ్డి (విజయక్రాంతి): జిల్లా గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డైరీ క్యాలెండర్లను సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రాజారామ్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దయానంద్, విజయలక్ష్మి, రమ్య, సాయి రెడ్డి, సతీష్ యాదవ్, శ్రీపతి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.