calender_icon.png 16 January, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా మత్స్యశాఖ అధికారి సుకీర్తిపై సస్పెన్షన్ వేటు

11-07-2024 02:19:43 AM

రంగారెడ్డి, జూలై 10 (విజయక్రాంతి): జిల్లా మత్స శాఖ అధికారి సుకీర్తి సస్పెన్షన్‌కు గురయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో పాటు మత్ససహకార సంఘం సొసైటీ నిధులను తన వ్యక్తిగతానికి వాడుకున్నారని.. ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజం అని తేలడంతో జిల్లా మత్స్యశాఖ అధికారి సుకీర్తిని సస్పెండ్ చేసూ..్త రాష్ట్ర ఫిషరీస్ డైరెక్టర్ డా.ప్రియాంక అలా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సుకీర్తి.. గతంలో సొసైటీ లీజుకు సంబంధించిన రూ.62,547 నిధులు తన వ్యక్తిగతానికి వాడుకున్నారని, ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఆమె నిధులు వసూలుకు పాల్పడినట్లు సొసైటీ సభ్యులు ఇటీవల రాష్ట్ర డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు సుకీర్తిపై వచ్చిన ఆరోపణలు నిజం అని తేలడంతో ఆమెను సస్పెండ్ చేసినట్లు సమాచారం.