నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తనిఖీ నిర్వహించారు. కడెం లక్ష్మణ్ చందా నిర్మల్ రూలర్ తదితర మండలాల్లో గల ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన బోధన మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు.
ఈనెల 11 నుంచి టెక్నికల్ కోర్స్ పరీక్షలు..
నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఈనెల 11 నుంచి టెక్నికల్ కోర్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు. టైలరింగ్ ఎంబ్రాయిడరింగ్ డ్రాయింగ్ టైపింగ్ తదితర పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 11 నుంచి 17 వరకు నిర్వహించే ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. నిర్దేశించిన పరీక్ష కేంద్రాలు ఉదయం సాయంత్రం వేళలో నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.