నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని మందులాపూర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తనిఖీ చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు పాఠశాల చేరుకున్న జిల్లా అధికారి విద్యార్థులతో కలిసి ప్రార్థన చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పదో తరగతి పరీక్షలు విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా చూడాలని ఉపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో పరీక్షల సహాయ అధికారి పద్మ, ఉపాధ్యాయులు ఉన్నారు.