నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు 16 రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు నష్టం జరగకుండా ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలకు ఆదేశించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. గురువారం జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న వంట సిబ్బంది సమ్మెలో పాల్గొనడం వల్ల విద్యార్థులకు భోజన సౌకర్యంలో ఇబ్బంది కలగకుండా సిబ్బందిని తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. విద్యా బోధనకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై సర్దుబాటు కింద కేజీబీవీ పాఠశాలలో విద్యాబోధన చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన చెందవద్దని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు పేర్కొన్నారు.