calender_icon.png 26 December, 2024 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన జిల్లా విద్యాధికారి

08-11-2024 12:16:56 AM

రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

మహబూబ్‌నగర్, నవంబర్ 7 (విజయక్రాంతి): మహబూబ్ నగర్ డీఈవో రవీం దర్ ఏసీబీకి చిక్కాడు. గురువారం రూ. 50వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒక ఉపాధ్యాయుడు సినీయార్టీ జాబితాలో తన పేరు నమోదుకు సంబంధించి సమస్యను పరిష్కరించాలని పలుమార్లు డీఈవోను కలిసి విన్నవించారు. అందుకు డీఈవో రూ.50 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు అంగీకరించిన ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు గురువారం ఉదయం డీఈవో ఇంటి వద్ద రూ.50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.