calender_icon.png 25 March, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీపీసీసీ అధ్యక్షుని కలిసిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు

23-03-2025 04:21:18 PM

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను ఆదివారం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు గిరెడ్డి మహేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్వహించిన తీర్మానంలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చేయడమే కాకుండా పార్లమెంట్లో తీర్మానం చేయాలని బిల్లు పంపించినందుకు ధన్యవాదాలు తెలిపి శుభాకాంక్షలు తెలిపినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి వర్గ సహచరులందరికీ కృతజ్ఞతలు తెలిపినట్లు తెలిపారు.