ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క(Minister Seethakka)ను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి(District Congress Leader Srinivas Reddy) కలిశారు. హైదరాబాద్ లో మంగళవారం కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్ తోపాటు మంత్రిని శ్రీనివాస్ రెడ్డి కలిసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి సీతక్కతో కాసేపు చర్చించారు. అటు ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి మంత్రి సీతక్క, సత్తు మల్లేష్ ల సహకారం ఎంతో ఉందని కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ముఖ్యంగా నియోజకవర్గానికి విధుల విడుదలలో ఎంతో సహకారమందని తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్ఠత కోసం జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఎంతో కృషి చేశారన్నారు. ఇటు సత్తు మల్లేష్ కూడా పార్టీ బలోపేతం కోసం మంచి సలహాలు సూచనలు అందించాలని వారివురికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేస్తున్నానన్నారు.