calender_icon.png 1 February, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన!

29-01-2025 12:53:35 AM

నాగర్ కర్నూల్, జనవరి28 (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాగర్ కర్నూల్ జిల్లాలో మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. మొదటగా అచ్చంపేట ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో సీజన్ వ్యాధులు ప్రబలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆసుపత్రి వైద్యుల వ్యవహార శైలి, సిబ్బంది, రోగుల సంఖ్యను తదితర మందుల వివరాలతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

నిరు పేదలకు ప్రభుత్వ వైద్యం ఉచితంగా అందించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని నిర్లక్ష్యం చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అనంతరం బల్మూరు మండలం రామగిరి చెంచు గూడెంలోని అంగన్వాడి సెంటర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విద్యార్థుల మధ్యాహ్న భోజనం, పాలు, గుడ్లు, తదితర సామాగ్రిని, రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

విద్యార్థులకు బాల్యం నుండే పోషకాహారం అందించాల్సి ఉందని అందుకు అంగన్వాడీలు కషి ఎంతో దాగి ఉందన్నారు.  బాధ్యతగా వ్యవహరించి ప్రతి పిల్లవాడికి పోషక ఆహారం అందేలా చూడాలని సూచించారు. గర్భిణీలు బాలింతలపై ప్రత్యేక దష్టి సారించి రక్తహీనత నుంచి కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు.

అనంతరం కలెక్టరేట్లోని చాంబర్లో ఆర్డీవోలు, వ్యవసాయ శాఖ అధికారులు,  ఎంపీడీవోలు, తాసిల్దారులు తదితర మండల అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. రాష్ర్ట ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో అధికారుల బాధ్యత అత్యంత కీలకమన్నారు. అనర్హులకు ఎట్టి పరిస్థితులోనూ అందే వీల్లేదని అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేలా పని చేయాలన్నారు.

అధికారులందరూ సమన్వయం చేసుకొని అనర్హులను తొలగిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించేలా పని చేయాలన్నారు. అలసత్వం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు. అనంతరం డిటిఓ బాలుతో కలిసి రోడ్డు భద్రత అవగాహన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అమరేందర్, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, అచ్చంపేట, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, ఆర్డీవోలు కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.