ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆరోగ్య పాఠశాలలో భాగంగా టాప్-3 లో నిలిచిన స్టూడెంట్ ఛాంపియన్ విద్యార్ధులకు డైట్ కాలేజ్ లో నిర్వహించిన ఫైనల్ ఎగ్జామ్ ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా(District Collector Rajarshi Shah) పరిశీలించారు. ఆరోగ్య పాఠశాల జిల్లా స్థాయి పోటీలు డైట్ కళాశాలలో సోమవారం నిర్వహించారు. జిల్లాలోని 18 మండలాల నుండి ముగ్గురేసి చొప్పున మండల స్టూడెంట్ ఛాంపియన్స్ ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో నుండి జిల్లా స్థాయిలో మొదటి ముగ్గురిని సెలెక్ట్ చేసి 26 జనవరి రోజు రిపబ్లిక్ డే కార్యక్రమాలలో భాగంగా వారికి సర్టిఫికెట్, నగదు పురస్కారం అందించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వయంగా పరీక్ష నిర్వహణను పరీక్షించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఐఈఓ రవీందర్, డీఈవో ప్రణీత, ఆరోగ్య పాఠశాల జిల్లా కన్వీనర్ అజయ్ కుమార్, ఆరోగ్య పాఠశాల రిసోర్స్ పర్సన్స్ బృందం సభ్యులు పాల్గొన్నారు.