నారాయణపేట,(విజయక్రాంతి): రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం విక్రయించుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ విసి హాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సివిల్ సప్లై మార్కెటింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఐకెపి 30, పీఏసీఎస్ 67, మెప్మా 2, రైతులు 2 కేంద్రాలు ప్రారంభించాలన్నారు. వరి ధాన్యం కేంద్రాలు ప్రారంభించని పక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వం సన్న రకం వడ్లకు రూ 500 బోనస్ గా చెల్లిస్తుందన్నారు. సన్న రకం, దొడ్డు రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే 20 లక్షల గన్ని బ్యాగుల సిద్ధంగా ఉన్నాయని ప్రతి కొనుగోలు కేంద్రానికి గన్ని బ్యాగులు సరఫరా చేయాలని ఆదేశించారు. గన్ని బ్యాగులపై కోడ్ నంబర్ రాయాలని తెలిపారు. అనంత్రం కలెక్టర్ ని ఎస్. పి. సన్మానం చేసిన చైర్మన్.ఈ సమావేశంలో ఎస్. పి. యోగేష్ గౌతమ్,మార్కెట్ చైర్మన్ ఆర్.శివారెడ్డి, వైస్ చైర్మన్ హనుమంతు, మార్కెట్ అధికారులు, డైరెక్టర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.