ఆదిలాబాద్,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణ(Road Accident Prevention)ను ప్రతి ఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా(District Collector Rajarshi Shah) అన్నారు. ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలు అవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధర్యంలో నిరహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో వందలాది ఆటోలతో నిరహించిన ఆటో ర్యాలీని ఉప రవాణా శాఖ కమిషనర్ రవీందర్ కుమార్ తో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన భద్రత పోస్టర్లు, స్టిక్కర్లు, బ్యానర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబం లో పెను విషాదం నెలకొంటుంది అన్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని తెలిపారు. ప్రమాదాల నివారణకై ప్రజలకు వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డిటివో శ్రీనివాస్, డిఎస్పీ జీవన్ రెడ్డి, పలువురు రవాణాశాఖ అధికారులు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు