చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని వడియారం ప్రభుత్వ పాఠశాలలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(District Collector Rahul Raj) ఆకస్మిక తనిఖీ చేశారు, పాఠశాలలు చదువుతున్న పదవ తరగతి విద్యార్థి విద్యార్థులకు ప్రత్యేక తరగతులపై ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులకు తరగతి గదిలో ఉపాధ్యాయులుగా మారి బ్లాక్ బోర్డుపై గణితంపై పలు ప్రశ్నలు వేసి విద్యార్థులతో జవాబు రాబట్టారు. విద్యార్థులు పాఠశాలలో ఏకాగ్రతతో చదివి పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులను కోరారు.