calender_icon.png 23 October, 2024 | 9:27 PM

ఐటీసీ బిల్డింగ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

23-10-2024 07:58:37 PM

తూప్రాన్,(విజయక్రాంతి): తూప్రాన్ లో టోల్ ప్లాజాలో ఉన్న తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో ఐటీసీ కంపెనీ కట్టిన స్టడీ హాల్ ను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. తూప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్ లో పరిశ్రమల సహాయంతో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ... ఐటిసీ కంపెనీ రూ.25 లక్షలతో స్వయంగా స్టడీ హాలు నిర్మించడం రెసిడెన్షియల్ విద్యార్థులకు మెరుగు పడినవన్నారు. ఫిబ్రవరి నెలలో  రవాణా, బీసీ శాఖ మాత్యులు పొన్నo ప్రభాకర్  ఆకస్మిక  సందర్శనలో రెసిడెన్షియల్ స్కూల్ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.  అప్పటికప్పుడు  విద్యార్థుల తాగునీటి  కోసం ప్రిన్సిపాల్ కు రూ.50 వేలు స్వయంగా ఇచ్చి, రెండవ ఆర్వో ప్లాoట్ ను ఏర్పాటు చేయించారని చెప్పారు. ఐటీసీ కంపెనీ రూ.25 లక్షలతో తామే స్వయంగా స్టడీ హాలు, లైబ్రెరీ నిర్మించారు. దానిని  మున్సిపల్ చైర్మన్, ఆర్డీఓతో కలసి ప్రారంభించుకోవడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మాట్లాడుతూ... మంత్రి పర్యటన తర్వాత వీఎస్టీ కంపెనీ రూ.5 లక్షల వ్యయంలో మొత్తం హాస్టల్, పాఠశాలకు కొత్త కలర్లు వేయించారు. అలాగే స్థానిక మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ నిధులతో ఓపేన్ జిమ్ ను ఏర్పాటు చేశారు. అంతేగాక స్థానిక క్రషర్ యజమానులతో మాట్లాడి వారి సహకారంతో వెనుక భాగంలో కూలిపోయిన కాంపౌండ్ వాల్ కు మరమ్మతులు చేయించారు. అలాగే సొసైటి వారు మంత్రి గారి చొరవతో ఆగిపోయిన అదనపు తరగతి గదులను నిర్మించడం మొదలు పెట్టినారు. ఈ మార్పులతో గురుకులంలో పిల్లల సంఖ్య ఈ సంవత్సరం గణనీయంగా పెరిగిందని ప్రిన్సిపాల్ తెలిపారు. తదుపరి జిల్లా కలెక్టర్ 10 వ తరగతి,ఇంటర్మీడియట్ విద్యార్థులతో  కలిసి  ముచ్చటించారు. వారికి భౌతిక శాస్త్రాన్ని   ఎలా సులభంగా అధ్యయనం చేయ వచ్చో ఉదారణలతో బోధించారు. ఈ కార్యక్రమంలో డా. సీఎస్ ప్రసాద్ (ఐటీసీ డిప్యూటీ సెక్రటరీ), మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఖాజా పాషా, తూప్రాన్ తహసీల్దార్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.