27-02-2025 01:26:40 AM
మెదక్, ఫిబ్రవరి 26(విజయ క్రాంతి): ఈనెల 27న జరుగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై ఈ ప్రక్రియలో పాల్గొనే పోలింగ్ నిర్వహించే అధికారులకు పూర్తి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల నిర్వహణలో ఓటర్లు స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా ఓటు హక్కు వినియోగానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు తూఫ్రాన్ జయచంద్రారెడ్డి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, డిఇఓ రాధా కిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి పాల్గొన్నారు.