calender_icon.png 25 October, 2024 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యం: కలెక్టర్ కుమార్ దీపక్

12-09-2024 03:01:35 PM

లక్షెట్టిపేట, విజయక్రాంతి: మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మున్సిపాలిటీ లోని ఓల్డ్ ఐకేపి ఆఫీస్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై స్వయం సహాయక మహిళా సంఘం ఏర్పాటు చేసిన సమావేశం మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  కుమార్ దీపక్ మాట్లాడుతూ..... రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలు సామాజికంగా, ఆర్ధికంగా తదితర అన్ని రంగాల్లో ముందుండలానే లక్ష్యం తో మహిళా శక్తి పథకాన్ని ప్రవేశ పెట్టి క్యాంటీన్స్, మిల్క్ పార్లర్స్, రైస్ మిల్స్ నిర్వహణ వంటి బాధ్యతలను అప్పజెప్పిందని ఇందుకు గాను స్వయం సహాయక గ్రూప్ లద్వారా లోన్స్ తీసుకొని వ్యాపార రంగంలో కూడ రానించాలని అన్నారు.

క్యాంటీన్ లో మంచి క్వాలిటీ ఫుడ్ మైంటైన్ చేస్తే కస్టమర్స్ ఆకర్శితులౌతారని దీంతో వ్యాపారాభివృద్ధి జరుగుతుందన్నారు. మహిళా సంఘలాలో ఎవరు కూడ నిరక్షారాస్యులు గా ఉండకూడదని కనీసం చదవడం, రాయడం, సంతకం చేయడం రావాలని ఇందుకు గాను ఐకేపీ సీసీ లు, వీఓఏ లు గ్రామాల్లో వారిని గురించి బాధ్యతయితంగా చదువు నేర్పివ్వాలని అన్నారు. చెన్నూర్, మంచిర్యాల లో కూడ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్, మిల్క్ పార్లర్లు ఏర్పాటు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి సూచించారు. ముందుగా ఉత్కూర్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి మిల్క్ పార్లర్ ను ప్రారంభించారు. క్యాంటీన్ ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటి మొక్కలు సంరక్షించాలని ఐకేపీ సిబ్బంది కి సూచించారు.ఈకార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, అడిషనల్ డిఆర్డిఓ వెంకటేశ్వర్లు,మండల స్పెషల్ ఆఫీసర్ స్వప్న, తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎంపీడిఓ సరోజ, ఎంపిఓ శ్రీనివాస్,ఏపీఓ వెంకటరమణ, ఏపీఎం లక్ష్మి, సీసీ లు లచ్చన్న, వసంత లక్ష్మి, సురేందర్,సుమలత, రాజమణి తదితరులు పాల్గొన్నారు