calender_icon.png 25 April, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్షయను అభినందించిన జిల్లా కలెక్టర్ క్రాంతి

25-04-2025 12:52:02 AM

సంగారెడ్డి, ఏప్రిల్ 24 : పటాన్చెరువు మండలం ముత్తంగిలోని మహాత్మ జ్యోతి బాపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపిసి పూర్తిచేసి ఇటీవల విడుదలైన ఫలితాలలో 1000 మార్కులకు గాను 977 మార్కులు సాధించి టాపర్ గా నిలిచిన మంగలి అక్షయను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం అభినందించారు. సంగారెడ్డిలో నిరుపేద కుటుంబానికి చెందిన మంగలి పద్మ, శ్రీశైలం దంపతుల కూతురు అక్షయ ఇంటర్ ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా అక్షయను కలెక్టర్ క్యాంప్  కార్యాలయంలో అభినందించి స్వీట్లు తినిపించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అక్షయకు కలెక్టర్ డాక్టర్ కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, కార్యదర్శి శ్రీశైలం, యువత ప్రధాన కార్యదర్శి రాము, యువత అధ్యక్షుడు ఆంజనేయులు, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.