calender_icon.png 19 April, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మ.... సన్నబియ్యం ఎట్లున్నది..

19-04-2025 05:55:25 PM

ఆరా తీసిన పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్..

గోదావరిఖనిలో దళిత మహిళ ఇంటికి వెళ్లి మధ్యాహ్న భోజనం చేసిన వైనం..

గోదావరిఖని (విజయక్రాంతి): అమ్మ... సన్న బియ్యంతో అందరూ కడుపునిండా తింటున్నారా.... ఆ బియ్యంతో అన్నం ఎట్లున్నది...? అంటూ పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sri harsha), రామగుండం శాసనసభ్యులు ఎమ్మెస్ రాజ్ ఠాకూర్(MLA MS Raj Thakur) ఆరా తీశారు. ఈ మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ లో శనివారం నాడు దళిత మహిళ రామిళ్ళ అమృతమ్మ ఇంటికి వెళ్లిన వారు లబ్ధిదారులతో కలిసి సన్న బియ్యంతో వండిన అన్నం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదివరకు దొడ్డు బియ్యం రేషన్ షాపుల్లోనే ఇచ్చి డబ్బులు తెచ్చుకునే వాళ్లమని, ఇప్పుడు సన్న బియ్యం తీసుకొని నేరుగా ఇంటికి వస్తున్నామని అందరం కడుపునిండా భోజనం చేస్తున్నామని, ఈ సందర్భంగా ఆ దళిత మహిళ ఎమ్మెల్యేకు, కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహపంక్తి భోజనం చేసిన వారిలో రామగుండం తాసిల్దార్ ఈశ్వర్, గోదావరిఖని 1-టౌన్ సిఐ రవీందర్ తో పాటు మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.