నవంబర్ 14 నుంచి 20 వరకు 71 వారోత్సవాల
సహకార వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, (విజయ క్రాంతి): జిల్లాలో 71వ అఖిలభారత సహకార వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ సమీకృత కలెక్టరేట్ లో సహకార వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో సహకార ఉద్యమం ఒక శతాబ్దానికి పైగా విస్తరించి ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత ప్రభావంతమైన సామాజిక ఆర్థిక ప్రయత్నాలలో ఒకటిగా ఉద్భవించిందని, వికసిత్ భారత్ యొక్క దృక్పథాన్ని సహకారం చేయడంలో సహకార సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని , దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు ప్రతి సంవత్సరం సహకార వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు.
ప్రస్తుత సంవత్సరంలో వికసిత్ భారత్ నిర్మించడంలో సహకార రంగం పాత్ర అంశం పై వారోత్సహాలు నిర్వహించాలని, నవంబర్ 14న సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో సహకార మంత్రిత్వ శాఖ చొరవ పాత్ర, నవంబర్ 15న సహకార సంస్థల్లో ఆవిష్కరణ సాంకేతికత సు పరిపాలన, నవంబర్ 16న వ్యవస్థాపకత ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి పోషించడంలో సహకార సంఘాల పాత్ర, నవంబర్ 17న సహకార సంస్థల రూపాంతం, నవంబర్ 18న సహకార సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, నవంబర్ 19నమహిళలు యువతు బలహీన వర్గాలకు కొరకు సహకార సంఘాలు, నవంబర్ 20న స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు మెరుగైన ప్రపంచం కోసం ముందుకు సాగడంలో సహకార సంస్థల పాత్ర వంటి కార్యక్రమాలను అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణు, జిల్లా సహకార అధికారి శ్రీ మాల, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.