calender_icon.png 24 April, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతి చట్టంతో రైతులకు ఎంతో మేలు

24-04-2025 06:16:42 PM

ముత్తారంలో భూ భారతి చట్టం అవగాహనలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..

ముత్తారం (విజయక్రాంతి): భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ భూ భారతి చట్టం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Sri Harsha) అన్నారు. గురువారం ముత్తారం మండల తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం ద్వారా పక్కగా భూ సరిహద్దులు నిర్ణయిస్తారని, రైతులకు, భూ హక్కుదారులకు ఉచిత న్యాయ సాయం అందుబాటులో ఉంటుందని అన్నారు.

భూ భారతి చట్టం ప్రకారం అధికారులు అందించిన ఆర్డర్లపై సంతృప్తి చెందకుంటే బాధితులు అప్పిల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. నిర్ణీత గడువు 30 రోజుల లోగా మ్యూటేషన్ పూర్తి చేయకుంటే ఆటోమేటిక్ గా మ్యూటేషన్ జరుగుతుందన్నారు. భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు. భూముల విస్తీర్ణం మార్పులు చేర్పులకు అవకాశం ఉందని, భవిష్యత్తులో మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లు భూమికి భూదార్ కార్డు అందించడం జరుగుతుందని, భూ భారతిలో సులభమైన మోడల్స్ మాత్రమే ఉండి సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని, తహసిల్దార్ నుండి సీసీఎల్ఏ వరకు ఆపిల్ వ్యవస్థను వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.

పెండింగ్ సాదా బైనామాల పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, తహసిల్దార్ మధు సూదన్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, మాజీ జడ్పిటిసిలు నాగినేని జగన్మోహన్ రావు, చొప్పరి సదానందం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, రైతులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.