మంథని (విజయ క్రాంతి): మంథని పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు, సివిల్ హాస్పిటల్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. జనరల్ వార్డ్, ఎక్స్రే రూమ్, ప్రయోగశాలను పరిశీలించారు. ప్రతిరోజు ఎన్ని నమూనాలను సేకరించి రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారో కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పేషెంట్లకు ఇస్తున్న మందులను పరిశీలించారు. వారి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమ సురేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, మెడికల్ సూపరిండెంట్ రాజశేఖర్ పాల్గొన్నారు.