calender_icon.png 20 April, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సింగ్ వసతి గృహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

22-03-2025 01:58:39 AM

భద్రాద్రి కొత్తగూడెం మార్చి 21 ( విజయక్రాంతి) కొత్తగూడెంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల వసతి గృహాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వసతి గృహంలో విద్యార్థినిలకు అందిస్తున్న సదుపాయాల, వసతి గృహంలో ఉంటున్న వారి సంఖ్య గురించి హాస్టల్ వార్డెన్ ,అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వసతి గృహంలోని అన్ని గదులను, మరుగుదొడ్లను, కిచెన్, త్రాగునీటి సౌకర్యం తదితర అన్ని సదుపాయాల్ని కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొత్తం 140 మంది విద్యార్థులు కు కలిపి ఒకటే పెద్ద హాలు లో ఉండటం గమనించిన ఆయన గదులుగా పార్టీషన్ చేయాలని అధికారులను ఆదేశించారు.

వసతి గృహంలోని హాల్లో ఎండ వేడి అధికంగా ఉండటం గమనించిన కలెక్టర్ ధర్మకోల్ తో సీలింగ్ ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అన్ని గదులలో కూలర్లు రేపటిలోగా ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు త్రాగునీటి కొరకు ఫ్రిజ్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వసతి గృహం చుట్టూ ప్రహరీ గోడను పరిశీలించిన కలెక్టర్ ఎత్తు తక్కువగా ఉండటానికి గమనించి, విద్యార్థినిల కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రహరీ గోడ పైన అదనంగా షీట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వసతి గృహం లో విద్యార్థులు భద్రతకు గాను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

విద్యార్థినిలు ప్రశాంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు.విద్యార్థినులకు నాణ్యమైన భోజనం,శుద్ధ జలం అందించాలని వార్డెన్ కు సూచించారు.

వసతి గృహ నిర్వహణపై సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఎటువంటిఅసౌకర్యం కలగకుండా చూడాలని సిబ్బందిని ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట వసతి గృహం వార్డెన్, సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.