calender_icon.png 7 March, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

06-03-2025 10:23:22 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం బీసీ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వసతి గృహంలోని గదులు, మరుగుదొడ్లు, బట్టలు ఎండబెట్టుకునే స్థలాన్ని, వంటగదిని, పరిశీలించారు. రోజువారీగా భోజనాన్ని ఎవరెవరు రుచి చూస్తున్నారని అడిగారు. వసతి గృహంలో గదుల డోర్లు, కిటికీలు, మరుగుదొడ్ల డోర్లు, మెయిన్ గేటు సరిగా లేకపోవటాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే వాటిని రిపేరు చేయించవలసిందిగా అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు భోజనం చేయడానికి వీలుగా వసతి గృహంలో డైనింగ్ హాల్ ఏర్పాటు చేయడానికి తగిన ప్రణాళికలు రూపొందించి నివేదికలు అందజేయాలని బీసీ సంక్షేమ అధికారి ఇందిరాను ఆదేశించారు.

వసతి గృహంలో పరిశుభ్రత పాటించాలని, ప్రతిరోజు మరుగుదొడ్లను శుభ్రం చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, స్నాక్స్ అందిస్తున్నారా అని తీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఏరోజుకారోజు బియ్యాన్ని శుభ్రం చేసి వంట చేయాలని సూచించారు. వసతి గృహంలో సమస్యల పరిష్కారానికి తగిన ప్రణాళికలు రూపొందించి నివేదికలు అందజేస్తే  పరిష్కరిస్తామని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట బీసీ సంక్షేమాధికారి ఇందిరా, వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు.