24 May, 2026 | 2:11 PM

Breaking News

భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •   విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు   •   పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు   •   శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు   •   కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు   •   నీలోఫర్ కేఫ్ పరిధిలో రెచ్చిపోయిన ఆకతాయిలు   •  

ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

01-11-2025 10:01 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): శనివారం  ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతినెల తనిఖీ చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా శనివారం సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ పరిశీలనలో భాగంగా సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన గోడౌన్  పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరిని లోపలికి అనుమతించరాదని అధికారులకు సెక్యూరిటీ గార్డ్ కు తెలిపారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లు సంతకం చేశారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట కొత్తగూడెం రెవిన్యూ డివిజనల్ అధికారి డి. మధు, ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్, తదితరులు పాల్గొన్నారు.