calender_icon.png 16 November, 2024 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-3 పరీక్షల కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

16-11-2024 03:14:04 PM

కరీంనగర్ (విజయక్రాంతి): శనివారం రోజున జగిత్యాల జేఎన్టియు కళాశాల, మల్యాల మండల కేంద్రంలో ఆల్ఫోర్స్ సెంటర్ ను జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పరిశీలించారు. ఈ నెల 17 18 వ తేదీలో గ్రూప్-3 పరీక్షకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. తరగతి గదులను ఎగ్జామినేషన్ రూమ్ లను పరిశీలించారు. పరీక్ష సెంటర్లు తరగతి గదులు హాల్ టికెట్  నెంబర్లు వేయాలని నిర్దేశించిన ప్రవేశ ద్వారాల మాత్రమే అనుమతించాలని ప్రవేశ గేట్ల దగ్గర హాల్ టికెట్ నెంబర్లు బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. శానీటేషన్ కూడా  పూర్తి చేయాలని ఎలాంటి అవాంతరాలు తావు లేకుండా సజావుగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం కోడిమ్యాల మండలంలోని గంగారాం తండలో వరి ధాన్య కొనుగోలు కేంద్రన్ని పరిశీలించారు. తేమ వచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని వేగవంతంగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, మధు సుధాన్, డిఆర్డిఓ, రఘు వరణ్, జేఎన్టీయూ ప్రిన్సిపల్ రావు, ఎమ్మార్వో, ఎంపీడీవో, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.