11-03-2025 11:15:17 PM
ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): ఆదర్శ పాఠశాల త్రాగునీటి సమస్యకు మూడు రూ.3 లక్షల మంజూరు చేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి. మంగళవారం ఆదిభట్ల మున్సిపాలిటీలో బొంగ్లూర్ మోడల్ స్కూల్లో త్రాగునీటి కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ స్పందించి బుధవారం రోజు బోర్ డ్రిల్ వేపించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్బంగా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. విద్యనభ్యసించే విద్యార్థులు కనీస వసతులు లేకుండా ఎక్కడ కూడా ఇబ్బందులు పడకూడదని అన్నారు. ఇరిగేషన్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి విద్యార్థులకు, హాస్టల్ కి కావాల్సిన బోరు (డ్రిల్) బుధవారం సాయంత్రం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. బోర్ వెల్ డ్రిల్లింగ్ కు సంబంధిత అధికారులు అందరూ పాల్గొని సమస్యను పరిష్కరించాలని అధికారులకు తెలిపారు.