calender_icon.png 4 October, 2024 | 8:38 PM

ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలి

04-10-2024 05:41:03 PM

క్షేత్రస్థాయిలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ 

కల్వకుర్తి : ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని సంభందిత అధికారులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్  ఆదేశించారు. శుక్రవారం లేఔట్ రెగ్యులేషన్ స్కీమ్ లో భాగంగా గతంలో ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న మహమ్మద్ రషీద్ ప్లాటును జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. వెల్దండ మండల కేంద్రంలోని ఇంపీరియల్ హోమ్ న్యూ కాలనీ పరిధిలోని సర్వేనెంబర్లు 714, 715, 716, 667, 668 నందు ప్లాట్ నెంబర్లు 30, 35 లను క్లుప్తంగా పరిశీలించారు. పంచాయతీ సెక్రటరీ గిరి ప్లాటు వివరాలు, ఈసీ వివరాలను అడిగి తెలుసుకున్నారు, దరఖాస్తు చేసుకున్న యజమాని స్థల డాక్యుమెంట్లను, ఫ్లాట్ విస్తీర్ణం రోడ్డు హద్దులను కలెక్టర్ పరిశీలించారు. పర్యవేక్షణ బృందాల అధికారులు తమ మొబైల్ ద్వారా నమోదు చేసే వివరాల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... సంబంధిత దరఖాస్తులను అధికారులందరూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన దరఖాస్తుల్లో న్యాయబద్ధంగా ఉన్న దరఖాస్తులను వెంటనే ఆమోదించాలన్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధ ప్రతిపాదికన దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు. ఎల్.ఆర్.ఎస్ పథకం కింద వచ్చిన దరఖాస్తులు, వాటి ప్రస్తుత స్థితిగతులు, అధికారులు ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియ పూర్తి చేసేందుకు నిర్దేశించుకున్న ప్రణాళిక మొదలగు వివరాలను న్యాయపరమైన చిక్కులను జాగ్రత్తగా పరిశీలించి దరఖాస్తుల రెగ్యులరేషన్ ప్రక్రియ కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, వెల్దండ తాహసిల్దార్ కార్తీక్ కుమార్, ఎంపీ ఓ లక్ష్మణ్, నిటిపారుదల ఏఈ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.