calender_icon.png 25 February, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో జిల్లా కలెక్టర్

25-02-2025 12:44:52 AM

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరిలో నిర్వహణ

మెదక్, ఫిబ్రవరి 24(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్  ఆధ్వర్యంలో సౌత్ ఈస్ట్ ఆసియా, ఇండియన్ ఓసియన్ రీజన్ కు సంబంధించిన దేశాల సివిల్ సర్వెంట్స్ కు స్థానిక పాలనలో సామర్ధ్యాల పెంపు అనే అంశంపై శిక్షణను ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరీలో ఏర్పాటు చేశారు.  ఈ సమావేశానికి ప్రత్యేక అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను ఆహ్వానించి స్థానిక పాలనలో సామర్థ్యాల పెంపుపై వివిధ దేశాల సివిల్ సర్వెంట్లకు అతిధి ఉపన్యాసంను ఇప్పించడం జరిగింది.

ఈ సంద్భంగా జిల్లా కలెక్టర్ మన రాష్ట్రంలో అమలవుతున్న స్థానిక పాలనపై సుదీర్ఘంగా తన అనుభవాలను పంచుకోవడం జరిగిందన్నారు. ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. గత సంవత్సరం కూడా  జిల్లా కలెక్టర్  బంగ్లాదేశ్ స్థాయి సివిల్ సర్వీస్ అధికారులకు ఢిల్లీ లో, ట్రైనీ  సివిల్ సర్వీసు అధికారులకు ముస్సోరి ఐఏఎస్ అకాడమీలో అతిథి ఉపన్యాసం ఇస్తూ తన అనుభవాలను పంచుకోవడం జరిగిందని తెలిపారు.