calender_icon.png 9 January, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధరఖాస్తులను అధికారులు తక్షణమే పరిష్కారించాలి

06-01-2025 10:20:16 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రజావాణి(Prajavani)లో వచ్చిన దరఖాస్తులను అధికారులు తక్షణమే పరిష్కారించాలని  జిలా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌(Kamareddy Collectorate)లో ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను పరిశీలించి పలు సమస్యలపై జిల్లాలోని ప్రజలు సమర్పించారు. వారి దరఖాస్తులను పరిశీలించి వాటిపై చర్యలు చేపట్టాలన్నారు. 96 ధరఖాస్తులు రాగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే(Indiramma Indla Survey)ను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సర్వే చేసిన వివరాల్లో రూఫ్ వివరాలు, గోడల వివరాలు పరిశీలించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, దివ్యాంగులు లబ్దిదారులకు పంపిణీ చేసిన రెండు పడక గదుల ఇళ్ల వివరాలు రేపటిలోగా సమర్పించాలని ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఇండ్ల సర్వే త్వరతిగతిన పూర్తి చేయాలన్నారు.