calender_icon.png 22 February, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్చి 18న జిల్లా బ్రాహ్మణ సంఘం ఎన్నికలు

21-02-2025 12:00:00 AM

రామాయంపేట, ఫిబ్రవరి 20: మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం ఎన్నికలను మార్చి 18వ తేదీన తూప్రాన్ పట్టణంలో నిర్వహించ నున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి సోమయాజుల రవీంద్ర శర్మ, సహాయ ఎన్నికల అధికారులు శాస్త్రుల మధుశ్రీ శర్మ, డీజీ.శ్రీనివాసశర్మ తెలిపారు.

ఎన్నికలు సజావుగా సాగడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, నర్సాపూర్, మెదక్, తూప్రాన్ డివిజన్లకు సంబంధించిన సభ్యుల ఓటర్ లిస్ట్ ను ఆయా డివిజన్ అధ్యక్షులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అయితే ఇప్పటికే జిల్లా బ్రాహ్మణ సంఘం ఎన్నికలు పూర్తయ్యాయని, అధ్యక్షుడిగా శలాక రాజేశ్వర శర్మ ఎన్నికైనట్లు, ఎన్నికల అధికారుల ప్రకటన లాంఛనమేనని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపారు.

ఈ విషయంలో జిల్లా బ్రాహ్మణ సంఘం సభ్యులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రజాస్వామ్యబద్ధంగా జిల్లా ఎన్నికలు నిర్వహిస్తామని వారు హామీ ఇచ్చారు. ఆరోజు జిల్లా సంఘంలో సభ్యత్వం ఉన్నవారు ఎవరైనా పోటీ చేయవచ్చని తెలిపారు.