calender_icon.png 12 April, 2025 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి

04-04-2025 10:46:06 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): మహమ్మద్ నగర్ మండల కేంద్రంతో పాటు నర్వ గ్రామాల్లోని ఎరువులు పురుగుమందుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. అధిక ధరలకు ఎరువులు పురుగుమందు విక్రయించవద్దని, రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని సూచించారు. నాసిరకం పురుగు మందులు విక్రయించినట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన వెంట స్థానిక మండల వ్యవసాయ అధికారిని నవ్య  వున్నారు.