calender_icon.png 19 April, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏజెన్సీ వైద్య సేవలపె జిల్లా యంత్రాంగం స్పెషల్ ఫోకస్

15-04-2025 12:57:39 AM

తీరిన వైద్యుల కొరత, మారుమూల ప్రాంతాలకు విస్తరించిన స్పెషాలిటీ వైద్యసేవలు.

 పెరిగిన ప్రసవాలు ఇతర స్పెషాలిటీ సేవలు

తీరిన డయాలసిస్ రోగుల పాట్లు

వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో మెరుగైన సేవలు

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 14 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అధికారుల సమన్వయంతో వైద్య ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తూ సూచనలు ఇస్తూ ప్రోత్సహిస్తూ జిల్లాలోని గిరిజన  పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. జిల్లాలో గత సంవత్సరంలో ముఖ్య మంత్రి,మంత్రులు ఆదేశాలు మేరకు వైద్యం పై శ్రద్ద పెట్టి అధికారులు కొత్త మెరుగులు దిద్దుతున్నారు.

తీరిన స్పెషలిస్ట్ వైద్యుల కొరత 

ప్రసూతి వైద్యులు , స్పెషాలిటీ వైద్యుల కొరత వేధిస్తున్న తరుణంలో అదనపు ప్రో త్సాహాలు ప్రకటించి నియమాకాలు చేపట్టారు తద్వారా మారుమూల ప్రాంతాలైన ఇల్లందు, అశ్వారావుపేట, మణుగూరు, చర్ల, భద్రాచలం వంటి ఆసుపత్రులలో వివిధ నిష్ణాతులైన వైద్యులు అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో నెలకు కేవలం 150 నుండి 200 ఉన్న ప్రసవాల సంఖ్య నేడు 538 కి చేరడం ,ఎక్కడికక్కడ సుఖప్రసవానికి సంబంధించిన ప్రసూతి వైద్యులు, పిల్లల వైద్యులు, మత్తు వైద్యులు, స్కానింగ్ వైద్యు లు, ఆపరేషన్ కు సంబంధించిన పరికరాలు, ఇతర వసతులు అన్నీ ఆసుపత్రుల లో కల్పించారు.

తీరిన డయాలసిస్ రోగుల పాట్లు 

గతంలో డయాలసిస్ రోగుల వారి వైద్యం కోసం నెలలు కొద్ది వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. రోగి చనిపోతే తప్ప ఇతరులకు స్లాట్ దొరికే పరిస్థితి ఉండకపోయేది. అలాంటిది నేడు సుమారు 53 మిషన్లతో 248 మంది సేవలు పొందుతూ 170 ఖాళీలు ఉన్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట, భద్రాచలం ,చర్ల వంటి మారుమూల ప్రాంతంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తో అతి స్వల్ప కాలంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం పట్ల కిడ్నీ రోగుల పాట్లు తప్పినట్లయింది. చర్ల లాంటి మారుమూల గిరిజన ప్రాంతంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం అనేది గిరిజనులకు వైద్య సేవలు చేరువ చేయడంలో జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యుల చిత్తశుద్ధికి నిదర్శనం.

ఇల్లందులో మొదలైన ఫిజియోథెరపీ సేవలు 

ఫిజియోథెరపీ చికిత్స కొరకు రోగులు తమ సొంత ఖర్చులతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించే వారు, డాక్టర్ ఉన్నప్పటికీ పరికరాలు లేవని డిసిహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు ద్వారా తెలుసుకున్న  స్థానిక శాసన సభ్యులు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి జిల్లా స్థాయి నిధులు రూ 2.50 లక్షలతో ఫిజియోథెరపీ పరికరాలు మంజూరు చేశారు. దీంతో రోజుకు 15 మంది రోగులు ఫిజియోథెరపీ సేవలు పొందుతున్నారు.

విష జ్వరాలు విజృంభిస్తున్న వేళ తీరిన మందుల కొరత 

విష జ్వరాలు జిల్లాలో విపరీతంగా విజృంభిస్తున్న వేళ జిల్లా కలెక్టర్ ,  జిల్లా మంత్రుల సమన్వయంతో మందులు, రక్త పరీక్షల కొరకు కావలసిన రీ-ఏజెంట్స్ కొరకు సుమారు రూ 90 లక్షలు మంజూరుచేసి మందుల కొరత తీర్చారు. తద్వారా రోగులపై ఆర్థిక భారం పడకుండా చేశారు.

మొదలవ్వనున్న కొత్త ఆసుపత్రుల భవంతులు 

ఇల్లందులో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం ఇటీవలే  రెవిన్యూ మంత్రి పొం గులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కాగా, త్వరలో అశ్వారావుపేట, బూ ర్గంపహాడ్ , చర్ల ఆసుపత్రుల భవంతుల శంకుస్థాపనలు జరగనున్నాయి.

వేసవి దృష్ట్యా రోగులకు ప్రత్యేక వసతులు 

జిల్లాలో ఎండలు మండిపోతున్న వేళ రో గులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఆసుపత్రిలో త్రాగునీటి కొరకు ఆర్వో వాటర్ ప్లాం ట్, కూల్ వాటర్ ప్రీజ్ లు, కారిడార్లలో సరిపడా ఫ్యాన్లు, వార్డులలో కూలర్లు , ఆప రేషన్ వార్డులో ఏసీలు ఏర్పాటు చేసి రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ప్రణాళికలతో ఏర్పాటు చేశారు.

-డి సి హెచ్ ఎస్, సూపెరింటెండెంట్, ఆస్పత్రి 

సిబ్బందిని అభినందించిన కలెక్టర్ 

ఎప్పటికప్పుడు సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చి ప్రణాళికా బద్ధంగా సమస్యల పరిష్కారాల కోసం కృషి చేస్తున్న జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ జి. రవిబాబు,వివిధ ఆస్పత్రి సూపెరింటెండెంట్లు అంకిత భావంతో మారుమూల ప్రాంతంలో పని చేస్తున్న వైద్య సిబ్బందిని జిల్లా కలెక్టర్ జితేష్ వి, పాటిల్ అభినందించారు. వైద్య సిబ్బంది మరింత బాధ్యతలతో సేవలు కొనసాగించాలని వారు కోరారు.