శాలువాతో సత్కరిస్తున్న ఆలయ అధికారులు
కొండపాక (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం కొమరవెల్లి మల్లన్నను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు పొందారు. ఆలయ అర్చకులు, అధికారులు అదనపు కలెక్టర్ కుటుంబసభ్యులను జ్ఞాపకలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి మండలం అధికారులు పోలీసులు ఉన్నారు.