l చిరంజీవి చేతులమీదుగానే పలువురికి అందజేత
l మాదాపూర్‌లో యోదా డయాగ్నొస్టిక్స్ కొత్త బ్రాంచి ప్రారంభించిన మెగాస్టార్
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): మాదాపూర్‌లో యోదా డయాగ్నొస్టిక్స్ కొత్త బ్రాంచ్‌ను ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు హెల్త్ కార్డ్స్ అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, యోదా డయాగ్నొస్టిక్స్‌తో అనుసంధానం చేశామని, దీని ద్వారా ఇప్పటివరకు 14 వేల మంది సినీ కార్మికులు, వారి కుటుంబాలకు హెల్త్ కార్డులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. ఈ కేంద్రం ఎన్నో అత్యాధునిక హంగులు, సదుపాయాలతో రూపొం దించారని పేర్కొన్నారు.
కానీ, ఇది పేదవారికి ఎంతవరకు ఉపయోగపడుతుందని ప్రశ్నించగా.. చిరంజీవి సమాధానం ఇచ్చారు. గతంలో అమీర్‌పేట బ్రాంచిని ప్రారంభించినప్పుడు నేను ఇదే ప్రశ్న అడిగానని తెలిపారు. పేదవారికి, సినీ కార్మికు లకు ఉపయోగపడేలా హెల్త్ కార్డుల ఆలోచన చేసినట్లు వివరించారు. దీనికోసం తన చారిటబుల్ ట్రస్ట్‌ను అనుసంధానం చేశామని వెల్లడించారు. వ్యాపా రంతో పాటు ప్రజాసేవ చేసేవాళ్లు చాలా అరుదుగా ఉంటారని యోదా అధినేత కంచర్ల సుధాకర్‌ను ఉద్దేశించి చిరంజీవి ప్రశంసించారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ.. ఈ హెల్త్ కార్డులు ఉన్నవారికి తక్కువ ధరలకే అన్ని పరీక్షలు చేయించు కోవచ్చని తెలిపారు.