calender_icon.png 15 January, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ

05-11-2024 06:32:34 PM

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని వలస ఆదివాసీ గ్రామమైన సుందరయ్య నగర్ వలస గొత్తికోయ యువతకు, బిసి బాయ్స్ హాస్టల్ విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజ్ కుమార్ వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. యువత మంచి మార్గంలో నడుచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలను అలవరుచుకుని ముందుకు సాగాలన్నారు. గిరిజనులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గిరిజన యువత క్రీడల్లో రాణించేలా, ఉద్యోగాలు సాధించేలా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.