calender_icon.png 20 April, 2025 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ

19-04-2025 01:52:50 AM

జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 18(విజయ క్రాంతి): భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో వీధుల్లోని చిరు వ్యాపారులకు గొడుగులను పంపిణీ చేశారు. ఈ నెల 24 న  భగవాన్ శ్రీసత్యసాయి వారి ఆరాధనా మహోత్సవాన్ని పురస్కరించుకొని వీధుల్లో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఎండ, వాన నుండి రక్షణకు ఉపయోగపడేలా పెద్ద, చిన్న గొడుగులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సత్యసాయి సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్ మాట్లాడుతూ భక్తులందరి సహకారంతో గొడుగుల పంపిణీ సేవతో పాటు వివిధ దీనజన సేవలు నిర్వహిస్తామని ముఖ్యంగా వేసవి కాలంలో 2 నెలల పాటూ ప్రతిరోజు ఉచితంగా మినరల్ వాటర్, బట్టర్ మిల్క్, చెప్పులు, టోపీలు అందించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో సత్యసాయి సంస్థ సభ్యులు చిటుమల్ల లక్ష్మీనారాయణ, తాటిపర్తి దశరథ రెడ్డి, గుండ రాజశేఖర్, పిప్పరి రాజేందర్, గణపతి నరేందర్ రాజు, మహంకాళి మహేష్, మహిళా సభ్యులు బట్టు శ్రీలత, తాటిపర్తి స్వప్న, గుండ అర్చన, జక్కం సరిత, సామ రజిత, వూటూరి నాగరాణి, బట్టు సాధన, మార విజయలక్ష్మి, బట్టు దీప, బట్టు ఆనంద వర్దిని పాల్గొన్నారు.