మునగాల: మండల కేంద్రానికి చెందిన వాసా శ్రీనివాసరావు కళావతి దంపతుల కుమారుడు వాసా దిలీప్ మండల కేంద్రంలో ప్రజ్ఞా పాఠశాల నందు పాఠశాల స్థాయి విద్యను పూర్తి చేసి ఉన్నత చదువులు అభ్యసించి గత పది సంవత్సరాల క్రితం అమెరికాలో స్థిరపడి ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తూ తన పుట్టిన గ్రామ ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో, దివ్యాంగుల కోసం 12 ట్రై సైకిళ్లను తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసి శనివారం మండల కేంద్రంలోని శివాలయం దేవస్థానం నందు తన కుటుంబ సభ్యుల సమక్షంలో 12 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎన్నారై వాస దిలీప్ మాట్లాడుతూ.. తాను పుట్టి పెరిగిన ఊరికి ఈ ప్రాంతంలో పేద ప్రజల కోసం, దైవ కార్యక్రమాల కోసం తన సంపాదించిన సంపాదనలో 10% వెచ్చించి ప్రతి సంవత్సరం ఇదే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వాసా దిలీప్ యశస్విని దంపతులు, వాస శ్రీనివాసరావు కళావతి దంపతులు, గోవిందరావు పుష్పలత దంపతులతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.